ప్రాజెక్ట్ కే... పాన్ ఇండియా సూపర్ స్టార్ ప్రభాస్ చేస్తున్న కాస్ట్లీయెస్ట్ మూవీ. మహానటి ఫేమ్ నాగ్ అశ్విన్ ఈ సినిమాకు దర్శకుడు కాగా, వైజయంతి మూవీస్ బ్యానర్ పై ch. అశ్వినీదత్ నిర్మిస్తున్న ఈ చిత్రం ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది.
తాజాగా ఈ సినిమాపై నాగ్ అశ్విన్ సెన్సేషనల్ కామెంట్స్ చేసారు. ఇప్పటివరకు ఈ సినిమా నుండి ఎటువంటి తాజా సమాచారం లేకపోవడంతో ఇప్పుడు బయటకు వచ్చిన ఈ సమాచారం డార్లింగ్ అభిమానులను ఫుల్ ఖుషి చేస్తుంది.
ఇంతకూ నాగి ఏమన్నారంటే, ప్రాజెక్ట్ కే ప్రేక్షకులకు ఒక సరికొత్త విజువల్ ఎక్స్పీరియన్స్ ఇస్తుందని, ఈ సినిమా కోసం వాడుతున్న కార్లు, సెట్స్..అన్నీ కూడా ఫ్రెష్ అండ్ కొత్తవని చెప్పుకొచ్చారు. ఎందుకంటే ప్రాజెక్ట్ కే కాన్సెప్ట్ విభిన్నమైనది మరియు కొత్తది కావడంతో ఈ సినిమా కోసం మేకర్స్ అంతా కొత్త టెక్నాలజీని వాడుతున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa