రేపు ఉదయం పదకొండింటికి విడుదల కాబోతున్న హిట్ 2 మూవీ ట్రైలర్ కి సంబంధించి కొంతసేపటి క్రితమే ట్రైలర్ లాంచ్ ఈవెంట్ డీటెయిల్స్ ను తెలుపుతూ మేకర్స్ సరికొత్త ప్రకటన చేసారు. ఈ మేరకు రేపు ఉదయం పదింటి నుండి PVR, RK సినీ ప్లెక్స్, హైదరాబాద్ లో హిట్ 2 ట్రైలర్ లాంచ్ ఈవెంట్ జరగనుంది.
శైలేష్ కొలను డైరెక్షన్లో పర్ఫెక్ట్ క్రైం ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ గా రూపొందిన ఈ మూవీలో మీనాక్షి చౌదరి హీరోయిన్ గా నటించింది. వాల్ పోస్టర్ సినిమాస్ బ్యానర్ పై నాచురల్ స్టార్ నాని, ప్రశాంతి తిపిర్నేని సంయుక్తంగా నిర్మించారు.