రీసెంట్గానే మెగాస్టార్ చిరంజీవి గారి ఖ్యాతి ఒక మెట్టు పైకెక్కింది. 53వ ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ ఆఫ్ ఇండియా ప్రధానం చేసే ఇండియన్ ఫిలిం పర్సనాలిటీ ఆఫ్ ది ఇయర్ అవార్డును మెగాస్టార్ అందుకోవడంతో చిరంజీవి గారికి ప్రపంచ నలుమూలల నుండి శుభాకాంక్షలు వెల్లివిరుస్తున్నాయి. సినీ సెలెబ్రిటీలు, రాజకీయనాకులు చిరును సోషల్ మీడియా ద్వారా అభినందించడం జరిగింది. మెగా మేనల్లుళ్లు సాయిధరమ్ తేజ్, వైష్ణవ తేజ్ ఒకడుగు ముందుకేసి, చిరు నివాసానికి వెళ్లి వ్యక్తిగతంగా కలిసి బొకే ఇచ్చి మరీ శుభాకాంక్షలను తెలిపారు. ఈమేరకు చిరుని కలిసి బొకే ఇస్తున్న పిక్ ను తేజ్ ట్విట్టర్ లో షేర్ చేసారు. ప్రస్తుతం ఈ పిక్ నెట్టింట చక్కర్లు కొడుతోంది.