విశ్వక్ సేన్, నివేదా పేతురాజ్ జంటగా నటించిన రెండవ చిత్రం "ధమ్కీ". రీసెంట్గా ఈ మూవీ ట్రైలర్ విడుదల కాగా, ప్రేక్షకుల నుండి సూపర్బ్ రెస్పాన్స్ వస్తుంది. ఎంతలా అంటే, గత మూడ్రోజుల నుండి ఈ ట్రైలర్ యూట్యూబ్ టాప్ ట్రెండింలో కొనసాగుతూ వస్తుంది. ఇప్పటివరకు ఈ ట్రైలర్ కు యూట్యూబులో 3 మిలియన్ ప్లస్ వ్యూస్, 152కే లైక్స్ వచ్చాయి.
ఈ సినిమాకు విశ్వక్ దర్శకుడిగా, సహనిర్మాతగా కూడా వ్యవహరించడం విశేషం. లియోన్ జేమ్స్ సంగీతం అందిస్తున్న ఈ మూవీ పక్కా మాస్ కమర్షియల్ చిత్రంగా రూపొందుతుంది. ఈ చిత్రం తెలుగు, హిందీ, తమిళం, మలయాళ భాషల్లో వచ్చే ఏడాది ఫిబ్రవరిలో విడుదల కాబోతుంది.