మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన సినిమా 'వాల్తేరు వీరయ్య'. ఈ సినిమాకి బాబీ దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో హీరోయిన్లుగా శృతి హాసన్, క్యాథరిన్ థ్రెసా నటిస్తున్నారు. ఈ సినిమాలో హీరో రవితేజ కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమాలోని బాస్ పార్టీ ఫుల్ సాంగ్ రేపు విడుదల కానుంది. ఇదిలా ఉంటే ఈ పాటను పవన్ కళ్యాణ్ అన్నయ్య చిరంజీవితో కలిసి 'వాల్తేరు వీరయ్య' ఫస్ట్ సింగిల్‌ని ఆస్వాదించారు. దీనికి సంబంధించిన ఫోటోలను చిత్ర బృందం సోషల్ మీడియాలో షేర్ చేసింది.