త్రివిక్రమ్ దర్శకత్వంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటించిన సినిమా 'అల వైకుంఠపురములో'. ఈ సినిమా 2020లో విడుదలై ఘన విజయం సాధించింది. అయితే ఈ సినిమాని హిందీలో 'షెహజాదా' అనే పేరుతొ రీమేక్ చేస్తున్నారు. ఈ సినిమాలో బాలీవుడ్ హీరో కార్తీక్ ఆర్యన్, కృతి సనన్ కలిసి నటించారు. ఈ సినిమాకి డేవిడ్ ధావన్ దర్శకత్వం వహించారు. తాజాగా ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ చేసారు చిత్రబృందం. ఈ సినిమాని ఫిబ్రవరి 10న థియేటర్లో రిలీజ్ చేయనున్నారు.