పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న సినిమా 'హరి హర వీరమల్లు'. ఈ సినిమాకి క్రిష్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ ఏకధాటిగా జరుగుతోంది. ఈ సినిమాకి ఎం.ఎం.కీరవాణి సంగీతం అందిస్తున్నారు. తాజాగా ఈ సినిమా షూటింగ్ లో పవన్ కళ్యాణ్ తో పాటు 900 మంది నటీనటులు, సిబ్బంది పాల్గొంటున్నారు. ఈ సినిమాని మెగా సూర్య ప్రొడక్షన్ కంపెనీ నిర్మిస్తుంది.