మెగాపవర్ స్టార్ రాంచరణ్, బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ రెండోసారి జంటగా నటిస్తున్న చిత్రం "RC 15". ఇంకా టైటిల్ ఖరారు కానీ ఈ చిత్రానికి కోలీవుడ్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వం వహిస్తున్నారు. పొలిటికల్ యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందుతున్న ఈ చిత్రం ప్రస్తుతం న్యూజిలాండ్ లో కొత్త షెడ్యూల్ జరుపుకుంటుంది.
లేటెస్ట్ గా న్యూజిలాండ్ సెట్స్ నుండి రాంచరణ్, కియారా అద్వానీల పిక్స్ విడుదలయ్యాయి. సెట్స్ లో చిత్రబృందంతో కలిసి లంచ్ చేస్తున్న కియారా, చెర్రీ ల పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఒక డ్యూయెట్ సాంగ్ షూటింగ్ నిమిత్తం RC 15 చిత్రబృందం న్యూజిలాండ్ కి వెళ్లిన సంగతి తెలిసిందే.