కొంతసేపటి క్రితమే వీరసింహారెడ్డి మూవీ నుండి జై బాలయ్య మాస్ యాంథెం సాంగ్ విడుదలైంది. థమన్ స్వరకల్పనలో మాంఛి సెలెబ్రేషన్ సాంగ్ గా రూపొందిన జై బాలయ్య పాట విజువలైజేషన్ పరంగా చాలా గ్రాండ్ గా ఉంది. సింగర్ కరిముల్లా ఈ పాటను పాడగా, రామజోగయ్యశాస్త్రి గారు లిరిక్స్ అందించారు. ఈపాటను చూస్తే తెలిసిపోతుంది..ఈ సినిమాలో బాలయ్య ఎంతటి పవర్ఫుల్ క్యారెక్టర్ లో కనిపించబోతున్నారన్న విషయం. అఖండ సినిమాలో జై బాలయ్య ప్రేక్షకాభిమానులకు ఎంత కిక్ ఇచ్చిందో, ఈపాట కూడా అంతే కిక్ ఇస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు.
గోపీచంద్ మలినేని డైరెక్షన్లో పక్కా మాస్ యాక్షన్ ఎంటెర్టైనెర్ గా రూపొందుతున్న ఈ సినిమాలో బాలకృష్ణ, శ్రుతిహాసన్ జంటగా నటిస్తున్నారు. థమన్ సంగీతం అందిస్తున్నారు.
మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై నవీన్ యెర్నేని, రవిశంకర్ నిర్మిస్తున్న ఈ సినిమా వచ్చే ఏడాది జనవరిలో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.