ఇటీవలే ‘ది ఘోస్ట్’తో అలరించారు హీరో నాగార్జున. ఆ తర్వాత ఆయన చేయనున్న చిత్రమేదన్నది ఇంత వరకూ తేలలేదు. ఇప్పుడాయన ఓ రీమేక్ కథకు పచ్చజెండా ఊపారని సమాచారం. మలయాళంలో విజయవంతమైన ‘పొరింజు మరియం జోస్’అనే చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేయనున్నారని.. దీన్ని శ్రీనివాస చిట్టూరి నిర్మించనున్నారని టాక్. రచయిత ప్రసన్నకుమార్ బెజవాడ దర్శకుడిగా పరిచయం కానున్నారని తెలుస్తోంది. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన రానున్నట్లు సమాచారం.