సీనియర్ నటి జయప్రదకు అరుదైన గౌరవం లభించింది. ఆమెను ఎన్టీఆర్ శతజయంతి అవార్డు వరించింది. 1970 - 80 దశకాలలో ఆమె ఎన్టీఆర్ తో కలిసి చేసిన సినిమాలలో అడవి రాముడు, యమగోల, యుగపురుషుడు, సూపర్ మేన్ వంటి హిట్ చిత్రాలు కనిపిస్తాయి. అప్పట్లో అందాల తార అంటే జయప్రద పేరునే చెప్పుకునేవారు. ఈ నెల 27న తెనాలిలోని ఎన్వీ ఆర్ కన్వెన్షన్ లో ఎన్టీఆర్ అవార్డును, బంగారు పతకాన్ని జయప్రదకు అందజేయనున్నారు. హీరో బాలకృష్ణ, మాజీ మంత్రి ఆలపాటి రాజా ఆధ్వర్యంలో జరగనున్న ఈ ఉత్సవాలకు లోక్ సత్తా అధినేత జయప్రకాష్ నారాయణ ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు.