బాలీవుడ్ హీరో వరుణ్ ధావన్ నటించిన 'భేదియా' సినిమా తెలుగులో 'తోడేలు' పేరుతో శుక్రవారం విడుదలైంది. అడవుల మధ్య రోడ్డు నిర్మించాలని వెళ్లిన రోడ్డు కాంట్రాక్టర్ (వరుణ్ ధవన్) రోడ్డు నిర్మించాడా? అతడిని తోడేలు ఎందుకు కరిచింది? రోడ్డు వేయడానికి సహకరించిన వారు ఎందుకు మరణించారు? అనేదే ఈ సినిమా కథ. ఫస్ట్ హాఫ్ లో సినిమా ఆసక్తికరంగా సాగుతుంది. కామెడీ, హారర్, థ్రిల్ అన్నీ బాగున్నాయి. సెకండాఫ్ లో కొన్ని సీన్లు సాగదీతగా అనిపిస్తాయి. వరుణ్ ధావన్ నటన సినిమాకే హైలైట్ అని చెప్పొచ్చు. విజువల్ ఎఫెక్ట్స్, కెమెరా పనితనం, నిర్మాణ విలువలు బాగున్నాయి. డైరెక్టర్ అమర్ కౌశిక్ తన పనితో మెప్పించాడు.
రేటింగ్: 3/5.