సీనియర్ కమెడియన్ బ్రహ్మానందం గారు, కలర్స్ స్వాతి, సముద్రఖని, శివాత్మిక రాజశేఖర్, రాహుల్ విజయ్, నరేష్ అగస్త్య, ఆదర్శ్, ఉత్తేజ్ ముఖ్యపాత్రలు పోషిస్తున్న చిత్రం "పంచతంత్రం". హర్ష పులిపాక డైరెక్షన్లో హార్ట్ టచింగ్ అంథాలజీ చిత్రంగా రూపొందిన ఈ సినిమా యొక్క ట్రైలర్ ఈ రోజు సాయంత్రం 04:05 నిమిషాలకు విడుదల కాబోతుంది. ఈ ట్రైలర్ ను నేషనల్ క్రష్ రష్మిక మండన్నా గారు డిజిటల్ లాంచ్ చెయ్యబోతున్నట్టు మేకర్స్ అఫీషియల్ ఎనౌన్స్మెంట్ చేసారు. పోతే, ఈ చిత్రం డిసెంబర్ 9న థియేటర్లలో విడుదల కాబోతుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa