ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పోసాని కృష్ణమురళి మళ్ళి డైరెక్టర్ గా మారనున్నాడా

cinema |  Suryaa Desk  | Published : Thu, Jan 03, 2019, 04:16 PM

సినీ రచయితగా .. దర్శకుడిగా .. నటుడిగా పోసాని తనదైన ముద్ర వేయడంలో సక్సెస్ అయ్యారు. దర్శకుడిగా విజయాలను ఎక్కువగా అందుకోలేకపోయిన ఆయన, నటుడిగా బిజీ అయ్యారు. విలక్షమైన పాత్రలను చేస్తూ ప్రేక్షకులను మెప్పిస్తూ వస్తున్నారు. ఈ మధ్య కాలంలో పోసాని లేని సినిమాలు లేవంటే అతిశయోక్తి కాదేమో. అంతగా ఆయన అవకాశాలను అందిపుచ్చుకుంటూ ముందుకువెళుతున్నారు.

ఇక ఆయన దర్శకత్వం జోలికి వెళ్లనట్టేనని అంతా అనుకున్నారు. కానీ ఆయన త్వరలో మెగాఫోన్ పట్టే ప్రయత్నంలో ఉన్నాడనేది తాజా సమాచారం. తెలుగు రాష్ట్రాల్లోని రాజకీయాల్లో ఇటీవల చోటుచేసుకున్న కొన్ని పరిణామాల ఆధారంగా ఆయన ఒక కథను సిద్ధం చేసుకున్నాడట. ఈ కథను సింగిల్ షెడ్యూల్లో పూర్తి చేసి, మే నెలలో విడుదల చేయాలనే ఆలోచనలో ఆయన వున్నాడని అంటున్నారు. ఏపీలో ఎలక్షన్స్ ను దృష్టిలో పెట్టుకునే ఆయన ఈ సినిమాను రూపొందిస్తున్నాడనే టాక్ ఫిల్మ్ నగర్లో వినిపిస్తోంది. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa