ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఇస్మార్ట్ శంకర్ ఫస్ట్ లుక్ కొత్తగా ఉంది రామ్

cinema |  Suryaa Desk  | Published : Thu, Jan 03, 2019, 05:00 PM

ఎనర్జిటిక్ హీరో రామ్ మొదటి సారి తన కెరీర్లో డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ తో కలిసి పనిచేసేందుకు రెడీ అయిన సంగతి తెలిసిందే.  పూరి-రామ్ కాంబినేషన్ లో తెరకెక్కనున్న సినిమా ఫస్ట్ లుక్ ను కాసేపటి క్రితమే ఫిలిం మేకర్స్ విడుదల చేశారు. గత కొన్ని రోజులుగా ఈ సినిమాకు 'ఇస్మార్ట్ శంకర్' అనే టైటిల్ ను ఫైనలైజ్ చేశారని వార్తలు వచ్చాయి. ఇప్పుడు అదే టైటిల్ కన్ఫాం అయింది.

మోషన్ పోస్టర్ లో మొదట డబల్ సిమ్ కార్డ్ అని ఇంగ్లీష్ లెటర్స్ వస్తాయి.. తర్వాత స్లో గా సర్క్యూట్ బోర్డు కనిపిస్తుంది. డబల్ సిమ్  కార్డ్.. సర్క్యూట్ బోర్డు అంతా రామ్ బ్రెయిన్. ఇక రామ్ తలకిందులుగా కనిపిస్తాడు. నోట్లో సిగరెట్ తో రఫ్ గడ్డంతో రామ్ నిజంగానే ఇస్మార్ట్ గా ఉన్నాడు.  ఫస్ట్ లుక్ మాత్రం చాలా ఇంప్రెసివ్ గా ఉంది. టైటిల్ కూడా సూపర్ క్యాచీగా ఉంది.  పూరి ఇలాంటి విషయాలలో ఎప్పుడూ ఫుల్ మార్క్స్ కొట్టేస్తాడు. సినిమా దగ్గరకు వచ్చేసరికి మాత్రం ఈమధ్య తడబడుతున్నాడు. మరి ఈ సినిమాతోనైనా ప్రేక్షకులను మెప్పించి..రామ్ కు కూడా ఒకమంచి హిట్టిస్తాడేమో వేచి చూడాలి.

ఈ సినిమాను పూరి జగన్నాథ్ టూరింగ్ టాకీస్.. పూరి కనెక్ట్స్ బ్యానర్లపై పూరి - ఛార్మీ లు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ నెలలోనే రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించి మే లో ప్రేక్షకుల ముందుకు తీసుకురాలని ప్లాన్ చేస్తున్నారట. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa