తెలుగుదనం నుంచి కేరళకు వెళ్లి అక్కడి అగ్రహీరోల సినిమాలకు ధీటుగా నిలబడిన నటీమణి షకీలా. ఆమె సినిమాలో ఉన్న విషయం కంటే కూడా వివాదమే విజయం దిశగా అడుగులు వేసేలా చేసేది. ఇప్పుడు షకీలా జీ వితంలో జరిగిన పలు ఘటనల ఆధారంగా ఆమె బయోపిక్ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈ చిత్రంలో రిచా చడ్డా హీరోయిన్ గా నటిస్తుండగా, కన్నడ దర్శకుడు ఇంద్రజిత్ లంకేష్ తెరకెక్కిస్తున్నాడు ముఖ్యంగా మలయాళ సినిమాలో ఈ భామ చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. ఈమె సినిమా వస్తే థియేటర్స్ అన్నీ ప్రేక్షకులతో నిండిపోయేవి. ఓ సమయంలో మమ్ముట్టి, మోహన్ లాల్ లాంటి హీరోలు కూడా షకీలా సినిమాలు బ్యాన్ చేయాలని ధర్నాలు చేసిన రోజులున్నాయి. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు షకీలా రేంజ్ ఏంటో.. ఇప్పుడు ఈమె బయోపిక్ వస్తుంటే ఎంతమంది రహస్య కథలు బయటికి వస్తాయి అని వణికిపోతున్నారు.
ఇటవల తాజాగా ఈ చిత్ర పోస్టర్ ఒకటి విడుదలై సంచలనం సృష్టిస్తోంది. మందు గ్లాస్ లో కూర్చొని మత్తెక్కించే ఫోజ్ ఇస్తూ పిచ్చెక్కిచ్చింది రిచా చడ్డా. ఇప్పటికే షకీలా బయోపిక్ షూటింగ్ పూర్తయింది. సమ్మర్ లో సినిమా విడుదల కానుంది. ఒకప్పుడు షకీలా సినిమా వస్తే అన్ని ఇండస్ట్రీలు ఊగిపోయేవి. 7 ఏళ్ల కింద సిల్క్ స్మిత బయోపిక్ డర్టీ పిక్చర్ ను ఇంకా ఎవరూ మరిచిపోలేదు. ఇప్పుడు షకీలా బయోపిక్ కూడా ఇదే దారిలో వస్తుంది. మరి ఈ చిత్రం ఎన్ని సంచలనాలకు తెర తీస్తుందో
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa