సూపర్ స్టార్ మహేష్ బాబు, టాలీవుడ్ బుట్టబొమ్మ పూజాహెగ్డే జంటగా నటిస్తున్న రెండవ చిత్రం "SSMB 28". దీనికి ముందు 'మహర్షి' లో వీరిద్దరూ కలిసి నటించారు. ఇంకా టైటిల్ ఖరారు చెయ్యని SSMB 28 సినిమాకు త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు డైరెక్టర్ గా వ్యవహరిస్తున్నారు. థమన్ సంగీతం అందిస్తున్నారు. మూవీ అఫిషియల్ ఎనౌన్స్మెంట్ టీజర్ లోనే రిలీజ్ డేట్ ను ప్రకటించి అందరికి షాక్ ఇచ్చారు SSMB 28 చిత్రబృందం. ఈ మేరకు ఏప్రిల్ 28, 2023లో ఈ మూవీ థియేటర్లలో గ్రాండ్ రిలీజ్ కాబోతుంది.
తాజా బజ్ ప్రకారం, SSMB 28 మూవీ విడుదల తేది వాయిదా పడిందని టాక్. వచ్చే ఏడాది ఆగస్టు 11న SSMB 28 థియేటర్లకు రాబోతుందని, త్వరలోనే అధికారిక ప్రకటన కూడా రాబోతుందని వినికిడి. మరి, చూడాలి ఈ విషయంలో ఎంతవరకు నిజముందో..!!