గంగాధర్ దర్శకత్వంలో వివేక్ వశిష్ట, ప్రియా వడ్లమాని, చైతన్యా రావు, ఆయేషా ఖాన్ ప్రధాన పాత్రలు పోషిస్తున్న చిత్రం "ముఖచిత్రం". పాకెట్ మనీ పిక్చర్స్ పతాకంపై మోహన్ ఎల్లా, ప్రదీప్ అగ్నిరేకుల ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. కాల భైరవ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు.
తాజాగా ఈ మూవీ థియేట్రికల్ ట్రైలర్ ను రిలీజ్ చేసేందుకు మేకర్స్ రంగం ముహూర్తం ఖరారు చేసారు. ఈ మేరకు డిసెంబర్ 1వ తేదీ ఉదయం పదకొండింటికి ముఖచిత్రం ట్రైలర్ విడుదల కాబోతుందని తెలుపుతూ స్పెషల్ పోస్టర్ ను విడుదల చేసారు.
యంగ్ హీరో విశ్వక్ సేన్ ఈ సినిమాలో గెస్ట్ అప్పియరెన్స్ చేస్తుండడం విశేషం. కథను మలుపు తిప్పే పవర్ ఫుల్ లాయర్ పాత్రలో విశ్వక్ సేన్ నటన అద్భుతంగా ఉంటుందట.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa