ఆర్ఎక్స్ 100 చిత్రంతో ఫుల్ పాపులర్ పొందిన నటుడు కార్తికేయ. ఈ చిత్రం భారీ విజయం సాధించడంతో కార్తీకేయకి వరుస ఆఫర్స్ వస్తున్నాయి. ప్రస్తుతం కబాలి వంటి భారీ బడ్జెట్ చిత్రాలని నిర్మించిన కలైపులి ఎస్ థాను నిర్మాణంలో హిప్పీ అనే సినిమా చేస్తున్నాడు. బైలింగ్యువల్ మూవీగా తెరకెక్కుతున్న ఈ చిత్రం ‘కబాలి, మల్లన్న , తేరి’వంటి భారీ బడ్జెట్ సినిమాలను నిర్మించిన ప్రముఖ తమిళ చిత్ర నిర్మాణ సంస్థ వి క్రియేషన్స్ పతాకంపై రూపొందుతుంది . తమిళ దర్శకుడు టి ఎన్ కృష్ణ ఈ చిత్రాన్ని తెరకెక్కించనుండగా, ఈ చిత్రంలో కార్తికేయ బాక్సర్‌గా కనిపిస్తాడని సమాచారం. ఈ చిత్రానికి నివాస్ ప్రసన్న సంగీతం అందిస్తున్నారు. ఇందులో కార్తికేయ సరసన ముంబై భామలు దిగాంగన సూర్యవంశీ, జజ్బా సింగ్ లని కథానాయికలుగా నటిస్తున్నారు . ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం నుండి సర్‌ప్రైజింగ్ పోస్టర్ విడుదలైంది. ఇందులో ఇద్దరు భామలతో కలిసి బీచ్‌లో ఎంజాయ్ చేస్తున్నాడు కార్తికేయ.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa