ప్రపంచ వ్యాప్తంగా సినిమా ప్రేక్షకులు అందరూ ఎదురు చూస్తోన్న సినిమా ‘అవతార్ 2’. జేమ్స్ కేమరూన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. ఇప్పటికే ఈ మూవీ కి సంబంధించి ప్రీ-రిలీజ్ బిజినెస్ కూడా ఊహించని స్థాయిలో జరుగుతుందని టాక్. డిసెంబర్ 16న ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తోన్న వేళ.. కేరళలో ఈ సినిమా ప్రదర్శనకు చుక్కెదురైంది. అవతార్’ సినిమాను కేరళలో విడుదల చేయబోమని ది ఫిల్మ్ ఎగ్జిబిటర్స్ యునైటెడ్ ఆర్గనైజేషన్ ఆఫ్ కేరళ (ఎఫ్‌ఈయుఓకే) ప్రకటించింది. ప్రస్తుతం ఫియూక్ నిర్ణయం దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. లాభాలు పంచుకునే విషయంలో థియేటర్ యజమానులు, డిస్ట్రిబ్యూటర్స్ మధ్య ఏర్పడిన వివాదం కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.