టాలీవుడ్ హీరో రామ్ చరణ్, దిగ్గజ దర్శకుడు శంకర్ కాంబోలో ఓ సినిమా తెరకెక్కుతోంది. దీనికి సంబంధించి రామ్ చరణ్ ఓ విషయాన్ని ట్విట్టర్ వేదికగా పంచుకున్నాడు. బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తుండగా.. రూ.15-20 కోట్లతో ఓ పాటను న్యూజిలాండ్ లో చిత్రీకరించినట్లు చెప్పాడు. ఈ డ్యూయెట్ చిత్రానికే హైలెట్ గా ఉంటుందని తెలిపాడు. న్యూజిలాండ్ షెడ్యూల్ పూర్తైందని వెల్లడించాడు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు.