కోలీవుడ్ లేడీ సూపర్ స్టార్ నయనతార, విలక్షణ నటులు అనుపమ్ ఖేర్, సత్యరాజ్ ముఖ్యపాత్రల్లో నటిస్తున్న చిత్రం "కనెక్ట్". నయనతార బర్త్ డే ట్రీట్ గా రీసెంట్గానే కనెక్ట్ టీజర్ రిలీజై ఆడియన్స్ ను భయపెట్టింది.
తాజాగా కనెక్ట్ మూవీ సెన్సార్ ఫార్మాలిటీస్ ను పూర్తి చేసుకుని, యూ/ ఏ సెర్టిఫికెట్ తెచ్చుకున్నట్టు తెలుస్తుంది. క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 22 న థియేటర్లలో ఈ సినిమా విడుదల కాబోతుంది.
మాయ, గేమ్ ఓవర్ సినిమాల దర్శకుడు అశ్విన్ శరవణన్ డైరెక్షన్లో హార్రర్ థ్రిల్లర్ గా రూపొందిన ఈ మూవీ లో వినయ్ రాయ్, హనియా నఫీసా కీరోల్స్ లో నటించారు. పోతే, ఈ సినిమాకు పృథ్వి చంద్రశేఖరన్ సంగీతం అందించారు.