పాన్ ఇండియా సెన్సేషనల్ డైరెక్టర్ ఎస్ ఎస్ రాజమౌళి గారు ప్రస్తుతం విదేశాల్లో RRR ప్రమోషన్స్ చేస్తూ బిజీగా ఉన్నారు. బాహుబలితో పాన్ ఇండియా ఎరెనా ను గ్రాండ్ గా స్టార్ట్ చేసిన రాజమౌళి ఆపై RRR సినిమాతో పాన్ ఇండియా వ్యాప్తంగా మాత్రమే కాక ప్రపంచవ్యాప్తంగా కూడా సెన్సేషన్ సృష్టించారు.
టాలీవుడ్ స్టార్ హీరోలు రాంచరణ్, జూనియర్ ఎన్టీఆర్ లతో పీరియాడికల్ యాక్షన్ డ్రామాగా రూపొందిన ఈ సినిమాలో అజయ్ దేవగణ్, అలియాభట్, ఒలీవియా మోరిస్, శ్రేయా శరణ్ కీలకపాత్రల్లో నటించారు. ఎం ఎం కీరవాణి సంగీతం అందించారు.
లేటెస్ట్ గా రాజమౌళి జూనియర్ ఎన్టీఆర్ గురించి చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతున్నాయి. ఒక మనిషిని పులిలా ఎలా మార్చగలను... పులిలా గర్జించేలా ఎలా చెయ్యగలను...పులికన్నా భయంకరంగా అతనిని ఎలా చూపించగలను.. ఇది కుదరదు.. నావల్ల కాదు అని అనుకుంటున్న తరుణంలో నాకొక సంగతి గుర్తుకు వచ్చింది. నాదగ్గర జూనియర్ ఎన్టీఆర్ ఉన్నాడన్న విషయం నేను మరచిపోయానని.. జూనియర్ ఎన్టీఆర్ తో నా పని సులభతరమైంది... అంటూ జక్కన్న చెప్పుకొచ్చారు.