శైలేష్ కొలను దర్శకత్వంలో, నాచురల్ స్టార్ నాని నిర్మాణసారధ్యంలో రూపొందిన క్రైమ్ మిస్టరీ యాక్షన్ థ్రిల్లర్ 'హిట్ 2'. డిసెంబర్ 2న అంటే రేపే హిట్ 2 మూవీ థియేటర్లకు రాబోతుంది. ఈ నేపథ్యంలో ఈ రోజు సాయంత్రం 06:03 నిమిషాలకు హిట్ 2 కిల్లర్ ను పరిచయం చెయ్యబోతున్నట్టు మేకర్స్ అఫీషియల్ ఎనౌన్స్మెంట్ చేసారు.
ఇప్పటివరకు విడుదలైన టీజర్, ట్రైలర్...దేనిలోనూ కిల్లర్ గురించిన ఒక్క సీన్ కూడా లేదు. దీంతో హిట్ 2 కిల్లర్ పై ఆడియన్స్ లో చాలా మంచి సస్పెన్స్ క్రియేట్ అయ్యింది.
అడివిశేష్, మీనాక్షి చౌదరి జంటగా నటించిన ఈ సినిమాలో రావురమేష్, తనికెళ్ళ భరణి, శ్రీనాధ్ మాగంటి, కోమలీ ప్రసాద్ ముఖ్యపాత్రలు పోషించారు.