నైట్రో స్టార్ సుధీర్ బాబు నుండి రాబోతున్న సరికొత్త చిత్రం "హంట్". ఇందులో శ్రీకాంత్, భరత్ నివాస్ కీలకపాత్రల్లో నటిస్తున్నారు. మహేష్ డైరెక్షన్లో హై ఇంటెన్స్ యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందుతున్న ఈ సినిమాలో సుధీర్ బాబు పవర్ఫుల్ పోలీసాఫీసర్ గా నటించబోతున్నారు. సుధీర్ బాబు పాత్రలో రెండు షేడ్స్ ఉండబోతున్నాయి.
రీసెంట్గా రిలీజైన టీజర్ కు ఆడియన్స్ నుండి చాలా మంచి స్పందన వచ్చింది. పోతే, కొంతసేపటి క్రితమే హంట్ మేకర్స్ నుండి బిగ్ అప్డేట్ వచ్చింది. అదేంటంటే, హంట్ రిలీజ్ డేట్ ను అతి త్వరలోనే ప్రకటించబోతున్నట్టు తెలుపుతూ బ్రాండ్ న్యూ పోస్టర్ ను విడుదల చేసారు. అలానే హంట్ పోస్ట్ ప్రొడక్షన్ పనులు ఫుల్ స్వింగ్ లో జరుగుతున్నాయని కూడా తెలిపారు.