ట్రెండింగ్
Epaper    English    தமிழ்

హైదరాబాద్ లో గొప్పగా జరగనున్న కార్తికేయ రిసెప్షన్

cinema |  Suryaa Desk  | Published : Fri, Jan 04, 2019, 04:07 PM

రాజమౌళి తనయుడు కార్తికేయ వివాహం ఈమధ్య పూజ ప్రసాద్ తో  జరిగిన సంగతి తెలిసిందే.  జైపూర్ లోని ఫెయిర్ మోంట్ హోటల్ లో జరిగిన ఈ వివాహానికి రాజమౌళి కుటుంబానికి సన్నిహితంగా ఉండే సెలబ్రిటీలు.. బంధువులు మాత్రమే హాజరయ్యారు.  వివాహం పూర్తయింది కాబట్టి ఇప్పుడు రాజమౌళి దంపతులు హైదరాబాద్ లో భారీ రిసెప్షన్ ప్లాన్ చేశారట.నానక్ రామ్ గూడ లోని రామానాయుడు స్టూడియోస్ ఈ రిసెప్షన్ కు వేదిక కానుంది. రేపు సాయంత్రం ఈ రిసెప్షన్ జరుగుతుందట.  ఇప్పటికే రాజమౌళి దంపతులు తెలుగు ఫిలిం ఇండస్ట్రీలోని ముఖ్యులకు.. రెండు తెలుగు రాష్ట్రాలలోని ప్రముఖులకు పర్సనల్ గా ఆహ్వానం అందించారట.  ఇందులో రాజకీయ రంగానికి చెందినవారితో పాటుగా.. వ్యాపార .. క్రీడా రంగాలకు చెందిన ముఖ్యులు ఉన్నారట.

రిసెప్షన్ హైదరాబాద్ లో జరుగుతోంది కాబట్టి భారీ సంఖ్యలో అతిథులు హాజరయ్యే అవకాశం ఉంది.  వివాహానికి హాజరుకాని టాలీవుడ్ సెలబ్రిటీలందరూ దాదాపుగా ఈ రిసెప్షన్ కు హజరవుతరాని నూతన దంపతులను ఆశీర్వదిస్తారని అంటున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa