కన్నడ హీరో కమ్ డైరెక్టర్ రిషబ్ శెట్టి తెరకెక్కించిన చిత్రం "కాంతార". ఈ సినిమాలో ఆయనే హీరోగా నటించారు. సప్తమి గౌడ హీరోయిన్ గా నటించింది. కిషోర్, మానసి సుధీర్, అచ్యుత్ కుమార్ ముఖ్యపాత్రలు పోషించారు. హోంబలే ఫిలిమ్స్ నిర్మించింది. తెలుగులో ఈ సినిమాను దిగ్గజ టాలీవుడ్ నిర్మాత అల్లు అరవింద్ గారు డిస్ట్రిబ్యూట్ చేసారు.
అక్టోబర్ 15న తెలుగు ప్రేక్షకులను పలకరించిన కాంతార తాజాగా యాభై రోజుల థియేట్రికల్ రన్ ను పూర్తి చేసుకుంది. రీసెంట్గానే డిజిటల్ ఎంట్రీ కూడా ఇచ్చిన కాంతారకు అక్కడ కూడా చాలా మంచి స్పందన వస్తుంది.