కోలీవుడ్ స్టార్ హీరో STR (శింబు) 18 పేజెస్ మూవీలో సెకండ్ సింగిల్ 'టైం ఇవ్వు పిల్లా' అనే బ్రేకప్ సాంగ్ ను పాడిన విషయం తెలిసిందే కదా. ఈ మేరకు రీసెంట్గానే మేకర్స్ నుండి అఫీషియల్ అప్డేట్ వచ్చింది. డిసెంబర్ 5వ తేదీన ఈ సాంగ్ పూర్తిగా విడుదల కాబోతుంది.
తాజాగా మేకర్స్ ఈ సాంగ్ నుండి 'టైం ఇవ్వు పిల్ల కొంచెం టైం ఇవ్వు.. నిన్ను కొంచెం కొంచెం మర్చిపోయే టైం ఇవ్వు' అని హీరో పాడుతూ వేసే డాన్స్ స్టెప్స్ కి సంబంధించిన గ్లిమ్స్ వీడియోను విడుదల చేసారు.
పల్నాటి సూర్యప్రతాప్ డైరెక్షన్లో విభిన్న ప్రేమకథగా రూపొందుతున్న ఈ సినిమాలో అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటించింది. డిసెంబర్ 23న ధియేటర్లలో విడుదల కాబోతున్న ఈ సినిమాకు గోపీసుందర్ సంగీతం అందించారు.