టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ అనిల్ రావిపూడి నటసింహ నందమూరి బాలకృష్ణతో ఒక సినిమా చేస్తున్నట్లు అధికారకంగా ప్రకటించిన సంగతి అందరికి తెలిసిందే. ఈ కాంబినేషన్ లో రానున్న సినిమా కోసం నందమూరి అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. డిసెంబర్ 8న గ్రాండ్ లాంచ్ ఈవెంట్‌తో ఈ సినిమా షూటింగ్ ప్రారంభమవుతుంది. ఈ షెడ్యూల్ కోసం ఒక స్పెషల్ జైల్ సెట్ వేస్తున్నట్లు ఫ్లాష్ బ్యాక్ జైల్ ఎపిసోడ్ తో షూటింగ్ స్టార్ట్ అవుతుందని సమాచారం.
కొన్ని రోజులుగా బాలీవుడ్ గ్లామర్ డాల్ సోనాక్షి సిన్హా ఈ సినిమాలో బాలయ్య సరసన జోడిగా నటిస్తున్నట్లు ఫిలిం సర్కిల్ లో వార్తలు వినిపించాయి. తాజాగా ఇప్పుడు ఈ పుకార్లు వైరల్ అవుతున్న నేపథ్యంలో, స్టార్ దివా సోనాక్షి సిన్హా తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో నేను తెలుగు సినిమా కోసం ఎంపికైనట్లు కొంతకాలంగా వార్తలు వస్తున్నాయి… అది నిజం కాదని స్పష్టం చేయాలనుకుంటున్నాను అంటూ పోస్ట్ చేసింది.
NBK108ని షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై సాహు గారపాటి మరియు హరీష్ పెద్ది భారీ బడ్జెట్‌తో నిర్మించనున్నారు. ఈ చిత్రానికి ఎస్ఎస్ థమన్ సంగీతం అందించనున్నారు. ఈ సినిమా దాదాపు 80 కోట్ల బడ్జెట్ తో రూపొందనుందని ఫిలిం సర్కిల్ లో వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం బాలకృష్,ణ గోపీచంద్ మలినేని దర్శకత్వంలో 'వీరసింహారెడ్డి' సినిమాతో బిజీగా ఉన్నారు.