అభిషేక్ శర్మ దర్శకత్వంలో బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ నటించిన 'రామ్ సేతు' సినిమా అక్టోబర్ 25న విడుదల అయ్యింది. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద అంతగా రాణించలేకపోయింది. లేటెస్ట్ అప్డేట్ ప్రకారం, ఈ చిత్రం ప్రముఖ OTT ప్లాట్‌ఫారమ్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో ప్రసారానికి అందుబాటులో ఉంది. ఆంగ్ల ఉపశీర్షికలతో హిందీ, తెలుగు మరియు తమిళంలో ప్రసారానికి అందుబాటులో ఉండగా, ప్రైమ్ యూజర్లు కూడా ఈ సినిమా చూడటానికి 199 చెల్లించాలి.
ఈ అడ్వెంచర్ థ్రిల్లర్ లో జాక్వెలిన్ ఫెర్నాండెజ్, నుష్రత్ భారుచా మరియు టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో సత్యదేవ్ కీలక పాత్రల్లో నటించారు. ఈ చిత్రాన్ని కేప్ ఆఫ్ గుడ్ ఫిల్మ్స్, అబుందాంటియా ఎంటర్‌టైన్‌మెంట్, లైకా ఫిల్మ్స్ మరియు అమెజాన్ ప్రైమ్ వీడియో నిర్మిస్తుంది.