మలయాళ చిత్ర పరిశ్రమలో విషాదం నెలకొంది. సినీ, టీవీ నటుడు కూచు ప్రేమన్ అలియాస్ కేఎస్ ప్రేమ్‌కుమార్ అనారోగ్యంతో కన్నుమూశారు. గత కొన్నేళ్లుగా కేరళలోని తిరువనంతపురంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయన ఈరోజు ఉదయం తుదిశ్వాస విడిచారు. ప్రస్తుతం ఆయన వయసు 68 ఏళ్లు. కాగా కూచు ప్రేమ్ డ్రామా ఆర్టిస్టుగా కెరీర్ ప్రారంభించాడు. ఆ తర్వాత సినిమా రంగంలోకి అడుగుపెట్టి మంచి పేరు తెచ్చుకున్నాడు.ఆయన మృతి పట్ల కేరళ సీఎం పినరయి విజయన్ సంతాపం తెలిపారు.