యంగ్ అండ్ ప్రామిసింగ్ హీరో ఆది సాయికుమార్ తన తదుపరి ప్రాజెక్ట్ ని శశికాంత్ దర్శకత్వంలో చేస్తున్న సంగతి అందరికి తెలిసిందే. ఈ సినిమాకి 'టాప్ గేర్' అనే టైటిల్ ని మూవీ మేకర్స్ లాక్ చేసారు. ఈ చిత్రంలో ఆది సాయికుమార్ సరసన జోడిగా రియా సుమన్ నటిస్తుంది. ఈ చిత్రం డిసెంబర్ 30, 2022న థియేటర్లలో విడుదల కానుంది.
తాజాగా ఈరోజు ఈ సినిమా టీజర్‌ని దర్శకుడు మారుతి లాంచ్ చేసి, మూవీ టీమ్‌కి తన శుభాకాంక్షలు తెలియజేశారు. బ్రహ్మాజీ, సత్యం రాజేష్, మైమ్ గోపి, నర్రా, శత్రు, బెనర్జీ, గిరిధర్ తదితరులు ఈ చిత్రంలో కీలక పాత్రలు పోషించారు. పక్కా కమర్షియల్ ఎంటర్‌టైనర్‌గా రూపొందించబడిన టాప్ గేర్‌కి హర్షవర్ధన్ రామేశ్వర్ సంగీత అందిస్తున్నారు.
ఆదిత్య మూవీస్ అండ్ ఎంటర్‌టైన్‌మెంట్స్ సమర్పణలో శ్రీ ధనలక్ష్మి ప్రొడక్షన్స్ బ్యానర్‌పై రూపొందనుంది. ఈ చిత్రాన్ని కె.వి.శ్రీధర్ రెడ్డి నిర్మిస్తున్నారు.