అశ్విన్ శరవణన్ దర్శకత్వంలో లేడీ సూపర్ స్టార్ నయనతార ఒక క్రేజీ ప్రాజెక్ట్ ని ప్రకటించిన సంగతి అందరికి తెలిసిందే. ఈ సినిమాకి 'కనెక్ట్' అనే టైటిల్ ని మూవీ మేకర్స్ లాక్ చేసారు. లేటెస్ట్ అప్డేట్ ప్రకారం, అగ్ర నిర్మాణ సంస్థ యువి క్రియేషన్స్ ఈ చిత్రాన్ని తెలుగులో విడుదల చేస్తున్నట్లు సమాచారం.
అందరూ ఎంతో ఆశక్తిగా ఎదురుచూస్తున్న ఈ సినిమాలో బాలీవుడ్ లోని ప్రముఖ నటుడు అనుపమ్ ఖేర్ ఒక ముఖ్యమైన పాత్రలో నటించారు. సత్యరాజ్, వినయ్ రాయ్, హనియా నఫీసా మరియు ఇతరులు ఈ చిత్రంలో సహాయక పాత్రల్లో నటిస్తున్నారు.
ఈ చిత్రాన్ని ఈ నెల 22న థియేటర్లలో విడుదల చేసేందుకు మూవీ మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. రౌడీ పిక్చర్స్ బ్యానర్‌పై విఘ్నేష్ శివన్ ఈ సినిమాని నిర్మించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa