తమిళనాట స్టార్ హీరోయిన్ స్టేటస్ ను అందుకున్న జ్యోతిక, వివాహం తరువాత నటనకు దూరమయ్యారు. కొంత గ్యాప్ తరువాత ఆమె ఈ మధ్యనే రీ ఎంట్రీ ఇచ్చారు. ప్రధాన పాత్రధారిగాను .. కీలకమైన పాత్రల్లోను ప్రేక్షకులను మెప్పిస్తూ వెళుతున్నారు. తాజాగా ఒక కార్యక్రమానికి హాజరైన ఆమె అజిత్ .. విజయ్ కాంత్ లను గురించి ప్రస్తావించారు.
"ఇతరుల సహకారం లేకుండా ఈ ప్రపంచంలో జీవించడం వీలు కాదు. అలాగే ప్రతి చిన్న విషయానికి ఇతరుల సహకారాన్ని ఆశించడం కూడా కరెక్ట్ కాదు. మనకి సాయం చేసినవారిని ఎప్పటికీ మరిచిపోకూడదు .. ఇక మనం చేసిన సాయాలను బయటికి చెప్పుకోకూడదు. అలా ఇతరులకి తమ సహకారాన్ని అందించి బయటికి చెప్పుకోని గొప్ప లక్షణం నాకు అజిత్ .. విజయ్ కాంత్ లలో కనిపించింది. ఈనాటి సమాజంలో అజిత్ .. విజయ్ కాంత్ వంటి వారు ఉండటం ఆనందించవలసిన విషయం. ఎందుకంటే ఈ రోజుల్లో 5 రూపాయల సాయం చేసి 500 రూపాయలు ఇచ్చామని డబ్బా కొట్టుకునేవాళ్లే ఎక్కువ" అని అన్నారు. ఎవరిని ఉద్దేశించి జ్యోతిక ఇలా మాట్లాడారనేది కోలీవుడ్లో హాట్ టాపిక్ గా మారింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa