ట్రెండింగ్
Epaper    English    தமிழ்

టీజర్ టాక్: నయనతార 'ఐరా' మూవీ

cinema |  Suryaa Desk  | Published : Sat, Jan 05, 2019, 06:24 PM

నయనతార ఒక సినిమాను ఒప్పుకుందీ అంటే, ఆ కథలో కొత్తదనం ఉంటుంది అనే నమ్మకాన్ని ఆమె ప్రేక్షకుల్లో కలిగించింది. అలాగే కథలో కొత్తదనం వుంటే నయనతార తన నటనా పటిమతో మరింత సమర్ధవంతగా నడిపించగలదనే నమ్మకం దర్శక నిర్మాతలలో పెరిగిపోయింది. ఈ కారణంగానే నయనతార ఖాతాలోకి వైవిధ్యభరితమైన చిత్రాలు .. విజయాలు చేరిపోతున్నాయి.


తమిళంలో ఆమె తాజా చిత్రంగా 'ఐరా' రూపొందుతోంది. కేఎమ్ సర్జున్ దర్శకత్వం వహిస్తోన్న ఈ హారర్ థ్రిల్లర్లో నయనతార ప్రధానమైన పాత్రను పోషిస్తోంది. తాజాగా ఈ సినిమా నుంచి ఒక టీజర్ ను వదిలారు. నయనతార డిఫరెంట్ లుక్స్ తో కనిపిస్తోన్న ఈ టీజర్ .. సినిమాపై ఆసక్తిని రేకెత్తిస్తోంది. టైటిల్లోను .. టీజర్లోను సీతాకోకచిలుకకి ఇచ్చిన ప్రాధాన్యత ఈ ఆసక్తిని రెట్టింపు చేస్తోంది. గతంలో 'మాయ'(మయూరి) .. 'డోరా' వంటి హారర్ థ్రిల్లర్స్ తో మెప్పించిన నయనతార, మరోసారి ప్రేక్షకులను భయపెట్టడానికి రెడీ అవుతోందన్న మాట.                                                       






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa