విలక్షణ నటుడు సత్యదేవ్ నుండి రాబోతున్న సరికొత్త చిత్రం "గుర్తుందా శీతాకాలం". ఫస్ట్ టైం సత్యదేవ్ నుండి రాబోతున్న ఔటండౌట్ రొమాంటిక్ లవ్ ఎంటర్టైనర్ కావడంతో ఈ సినిమాపై ఆయన అభిమానులు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు.
నాగశేఖర్ డైరెక్షన్లో మలయాళ సూపర్ హిట్ మూవీ లవ్ మాక్ టైల్ కు తెలుగు రీమేక్ గా రూపొందిన ఈ సినిమాలో తమన్నా మెయిన్ హీరోయిన్ గా నటిస్తుండగా, మేఘా ఆకాష్, కావ్యాశెట్టి కీలకపాత్రల్లో నటిస్తున్నారు.
ఈ ఏడాది మొదట్లోనే విడుదల కావాల్సిన గుర్తుందా శీతాకాలం పలు మార్లు వాయిదాపడి ఎట్టకేలకు ఏడాది చివర్లో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమైంది. సత్యదేవ్ రొమాంటిక్ లవర్ బాయ్ అవతారాన్ని చూడాలనుకుంటే రేపే థియేటర్లకు వెళ్ళండి. ఎందుకంటే రేపే ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా థియేటర్లకు రాబోతుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa