ట్రెండింగ్
Epaper    English    தமிழ்

లేటెస్ట్.. "చిల్ల చిల్ల" ఫాస్ట్ బీట్ సాంగ్ వచ్చేసిందోచ్..!!

cinema |  Suryaa Desk  | Published : Fri, Dec 09, 2022, 06:40 PM

కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ కుమార్ నటిస్తున్న కొత్త చిత్రం "తునివు" నుండి కొన్ని నిమిషాల క్రితమే చిల్ల చిల్ల లిరికల్ సాంగ్ విడుదలైంది. ఘిబ్రాన్ మ్యూజిక్ డైరెక్షన్లో సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచంద్రన్ పాడిన ఈ మాస్ ఫాస్ట్ బీట్ సాంగ్ కోసం తాలా అభిమానులు ఎంతో కుతూహలంగా ఎదురుచూస్తున్నారు. ఇక మొత్తానికి ఆ టైం వచ్చేసరికి ఫ్యాన్స్ ఆనందానికి అవధులు లేకుండా పోయింది. అదీకాక, చిల్ల చిల్ల పాట పెప్పీ ట్యూన్ తో ఫ్యాన్స్ కు ఇట్టే కనెక్ట్ అయిపోయేలా ఉంది.


మంజు వారియర్, సముద్రఖని కీలకపాత్రల్లో నటిస్తున్న ఈ సినిమాను బే వ్యూ ప్రాజెక్ట్స్, జీ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. హెచ్ వినోద్ డైరెక్షన్లో ఔటండౌట్ కమర్షియల్ యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందిన ఈ సినిమా పొంగల్ కానుకగా తెలుగు, తమిళ భాషలలో విడుదల కాబోతుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa