హారర్ థ్రిల్లర్ గా రీసెంట్గానే ప్రేక్షకుల ముందుకొచ్చిన "మసూద"కు పాజిటివ్ రివ్యూలు రావడమే కాక బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా నాలుగో వారంలోనూ మంచి కలెక్షన్లను నమోదు చేస్తుంది. హీరోయిన్ సంగీత, తిరువీర్, కావ్యా కళ్యాణ్ రామ్, ముఖ్యపాత్రల్లో నటించినఈ చిత్రాన్ని సాయి కిరణ్ డైరెక్ట్ చేసారు. శుభలేఖ సుధాకర్, అఖిలా రామ్, సత్యం రాజేష్ కీలకపాత్రల్లో నటించిన ఈ చిత్రాన్ని స్వధర్మ్ ఎంటర్టైన్మెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్ పై రాహుల్ యాదవ్ నక్కా నిర్మించారు.
తాజాగా ఈ సినిమా నుండి 'దాచి దాచి' వీడియో సాంగ్ విడుదలైంది. ఈ ఎమోషనల్ సాంగ్ ను సిద్ శ్రీరామ్ పాడగా, ప్రశాంత్ R విహారి స్వరపరిచారు. చైతన్య పింగళి లిరిక్స్ అందించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa