ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సిద్దార్ధ్ మల్హోత్రా "మిషన్ మజ్ను" టీజర్ రిలీజ్

cinema |  Suryaa Desk  | Published : Sat, Dec 17, 2022, 01:41 PM

నేషనల్ క్రష్ రష్మిక మండన్నా హిందీ లో నటించిన రెండవ చిత్రం "మిషన్ మజ్ను". ఇందులో హీరో సిద్దార్థ్ మల్హోత్రా సరసన రష్మిక నటించింది. ఈ సినిమా థియేటర్లలో కాకుండా డైరెక్ట్ ఓటిటిలో రిలీజ్ అవ్వడానికి ముహూర్తం ఫిక్స్ చేసుకుంది. ఈ మేరకు జనవరి 20, 2023న ప్రముఖ ఓటిటి నెట్ ఫ్లిక్స్ లో మిషన్ మజ్ను స్ట్రీమింగ్ కి రాబోతుంది.


తాజాగా నెట్ ఫ్లిక్స్ సంస్థ మిషన్ మజ్ను టీజర్ ను విడుదల చేసింది. ఈ సినిమాలో సిద్దార్థ్ దేశం కోసం ప్రాణాలైనా తృణప్రాయంగా ఇచ్చేసే ఒక పవర్ఫుల్ ఏజెంట్ గా నటిస్తున్నారు. టీజర్ సినిమాపై ఆసక్తిని కలుగజేస్తుంది.


శంతను బాగ్చి డైరెక్టోరియల్ లో పేట్రియాటిక్ యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందిన ఈ సినిమాను రోన్ని స్క్రూవాలా, అమర్ బుటల , గరిమ మెహతా నిర్మించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa