హిట్ వచ్చినా, ఫ్లాప్ వచ్చినా ..ఏమాత్రం పట్టించుకోకుండా తన పని తాను చేసుకుంటూ వెళ్లే ట్యాలెంటెడ్ యంగ్ హీరో ఆది సాయికుమార్. ఆయన నుండి తాజాగా "టాప్ గేర్" అనే సినిమా విడుదల కావడానికి రెడీ అవుతుంది. ఈ సినిమాకు శశికాంత్ డైరెక్టర్ గా వ్యవహరిస్తుండగా, రియా సుమన్ హీరోయిన్ గా నటిస్తుంది. శ్రీధనలక్ష్మి ప్రొడక్షన్స్ బ్యానర్ పై కేవీ శ్రీధర్ రెడ్డి నిర్మించారు. హర్షవర్ధన్ రామేశ్వర్ సంగీతం అందించారు.
డిసెంబర్ 30వ తేదీన థియేటర్లలో విడుదల కావడానికి సిద్దమవుతున్న టాప్ గేర్ సినిమాకు సంబంధించి ఈ రోజు పదకొండు గంటలకు థియేట్రికల్ ట్రైలర్ విడుదల కాబోతుంది. మాస్ రాజా రవితేజ ఈ ట్రైలర్ ను లాంచ్ చెయ్యనున్నారు.