బాలీవుడ్ భామ కంగనా రనౌత్ భారత మాజీ ప్రధాని ఇందిరాగాంధీ జీవిత పాత్రలో నటిస్తున్న విషయం తెలిసిందే. తానే డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాకు 'ఎమర్జెన్సీ' అనే టైటిల్ ఫిక్స్ చేశారు. కాగా, ఈ చిత్రానికి సంబంధించిన కొన్ని సీన్లు పార్లమెంట్ భవనం లోపల షూట్ చేసేందుకు అనుమతివ్వాలని కంగనా లోక్ సభ కార్యాలయాన్ని కోరిందని సమాచారం. అయితే పార్లమెంటు లోపల ప్రైవేటు వ్యక్తులు, సంస్థలు షూటింగ్ చేసేందుకు వీల్లేనందున కంగనాకు పార్లమెంట్ అనుమతి ఇవ్వకపోవచ్చని తెలుస్తోంది.