ట్రెండింగ్
Epaper    English    தமிழ்

‘అన్ స్టాపబుల్’ ప్రభాస్ ఎపిసోడ్ స్ట్రీమింగ్ అప్పుడే!

cinema |  Suryaa Desk  | Published : Tue, Dec 20, 2022, 01:13 PM

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, మరో స్టార్ గోపీచంద్.. బాలయ్య హోస్ట్ గా వ్యవహరించిన ‘ఆహా’ అన్ స్టాపబుల్ షోకి వచ్చిన సంగతి తెలిసిందే. చాలా రోజుల తర్వాత ప్రభాస్ ఇలా బయటకు రావడం, గ్లింప్స్ లో సరదాగా మాట్లాడడంతో ఈ ఎపిసోడ్ పై భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే, ఈ ఎపిసోడ్ న్యూ ఇయర్ కానుకగా డిసెంబర్ 30న ‘ఆహా’లో స్ట్రీమింగ్ కానుంది. ఈ మేరకు అధికారిక ప్రకటన చేశారు. దీంతో అప్పటివరకూ ఆగాలా అంటూ ప్రభాస్ అభిమానులు నిరాశ చెందుతున్నారు. మరోవైపు, జయసుధ, జయప్రద, రాశీఖన్నాలతో సందడి చేసిన బాలయ్య ఎపిసోడ్ ఈ నెల 23న స్ట్రీమ్ కానుంది.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com