ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అజయ్ దేవగణ్ 'భోళా' ఫస్ట్ లుక్ రిలీజ్

cinema |  Suryaa Desk  | Published : Tue, Dec 20, 2022, 01:46 PM

కోలీవుడ్ మూవీ "ఖైదీ" 2019లో విడుదలై ఎంతటి ప్రభంజన విజయం సాధించిందో అందరికీ తెలిసిందే. ఔటండౌట్ మాస్ యాక్షన్ ఎలిమెంట్స్ తో, హీరోయిన్ లేకుండా బరిలోకి దిగిన ఈ సినిమాను ప్రేక్షకులు విశేషంగా ఆదరించారు. తెలుగులో అదే టైటిల్ తో విడుదలై ఇక్కడ కూడా బ్లాక్ బస్టర్ విజయాన్ని సాధించిన ఈ సినిమా హిందీలో 'భోళా' పేరుతో రీమేక్ అవుతుంది. బాలీవుడ్ సీనియర్ హీరో అజయ్ దేవగణ్ డైరెక్టోరియల్ లో నాల్గవ సినిమాగా తెరకెక్కుతున్న ఇందులో ఆయనే హీరోగా నటిస్తున్నారు. టబు కీలకపాత్రలో నటిస్తుంది. అమలాపాల్ స్పెషల్ రోల్ లో నటిస్తుంది.


తాజాగా ఈ సినిమా నుండి అజయ్ దేవగణ్ ఫస్ట్ లుక్ రిలీజ్ అయ్యింది. నుదుటున విభూది నామాలతో అజయ్ లుక్ వెరీ ఇంటెన్స్ అండ్ ఇంట్రిగ్యుయింగ్ గా ఉంది. అజయ్ దేవగణ్ ఫిలిమ్స్, డ్రీం వారియర్ పిక్చర్స్, టి సిరీస్ , రిలియన్స్ ఎంటర్టైన్మెంట్స్ సంస్థ సంయుక్త నిర్మాణంలో రూపొందుతున్న ఈ సినిమా మార్చ్ 30, 2023లో విడుదల కాబోతుంది. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com