సుకుమార్ లేకపోతే తన జీవితం ఇలా ఉండేది కాదని ఐకానిక్ స్టార్ అల్లు అర్జున్ అన్నారు. తాను ఈ రోజు ఇలా ఉన్నానంటే దానికి కారణం ఆయనేనని చెప్పారు. ’18 పేజెస్’ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కి బన్నీ ముఖ్య అతిథిగా వచ్చారు. గీతా ఆర్ట్స్-2 బ్యానర్ పై రూపొందిన ఈ సినిమా డిసెంబర్ 23న విడుదల కానుంది. ‘పుష్ప 2’ అప్ డేట్ గురించి చెప్పకపోతే డైలాగ్స్ లీక్ చేస్తానని తాను కూడా సుకుమార్ ను బెదిరిస్తూనే ఉన్నానని బన్నీ పేర్కొన్నారు. కాగా, సుకుమార్-అల్లు అర్జున్ కాంబోలో వచ్చిన ఆర్య, ఆర్య2, పుష్ప సినిమాలు భారీ హిట్ అందుకున్నాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa