ప్రతిష్ఠాత్మక ఆస్కార్ అవార్డుకు బాలీవుడ్ నటుడు రాజ్‌కుమార్ రావు నటించిన న్యూటన్ చిత్రం నామినేట్ అయింది. ఉత్తమ విదేశీ చిత్రం విభాగంలో ఈ సినిమా నామినేట్ అయిందని అధికారికంగా ప్రకటన వచ్చింది. తాను నటించిన సినిమా.. ఆస్కార్‌కు నామినేట్ అయినందుకు రాజ్‌కుమార్ రావు హర్షం వ్యక్తం చేశాడు. ఈ సినిమా బృందానికి శుభాకాంక్షలు తెలుపుతున్నట్లు తన ట్విట్టర్ ఖాతాలో పేర్కొన్నాడు. రాజకీయ వ్యంగ్యరూపకంగా తీసిన ఈ సినిమాలో రాజ్‌కుమార్ రావుతో పాటు పంకజ్ త్రిపాఠి, అంజలి పాటిల్, రఘుబిర్ యాదవ్ ప్రధానపాత్రల్లో నటించారు. ఈ సినిమాకు అమిత్ మసూకర్ దర్శకత్వం వహించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa