కోలీవుడ్ స్టార్ హీరో తలపతి విజయ్ తో ప్రముఖ టాలీవుడ్ నిర్మాత దిల్ రాజు "వారిసు" మూవీని నిర్మిస్తున్న సంగతి తెలిసిందే కదా. పొంగల్ 2023 కానుకగా తెలుగు, తమిళ భాషల ప్రేక్షకులను అలరించేందుకు ముస్తాబవుతున్న ఈ సినిమా నుండి లేటెస్ట్ గా థర్డ్ లిరికల్ 'సోల్ ఆఫ్ వారిసు' సాంగ్ విడుదలైంది. సీనియర్ సింగర్ చిత్ర గారు పాడిన ఈ అమ్మ పాట వినడానికి ఎంతో మధురంగా ఉంది. థమన్ ఈ గీతాన్ని సోల్ ఫుల్ ట్యూన్ తో స్వపరిచారు.
వంశీ పైడిపల్లి డైరెక్షన్లో విజయ్, రష్మిక మండన్నా జంటగా నటించిన వారిసు తెలుగులో వారసుడు టైటిల్ తో విడుదల కాబోతుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa