మెగాస్టార్ చిరంజీవి గారు నటిస్తున్న న్యూ మూవీ "వాల్తేరు వీరయ్య". బాబీ కొల్లి డైరెక్షన్లో పక్కా కమర్షియల్ యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందిన ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తుంది. దేవిశ్రీప్రసాద్ సంగీతం అందించారు.
ఇప్పటి వరకు వాల్తేరు వీరయ్య నుండి విడుదలైన రెండు లిరికల్ బాస్ పార్టీ, శ్రీదేవి - చిరంజీవి సాంగ్స్ చార్ట్ బస్టర్లుగా నిలిచాయి. ఈ నేపథ్యంలో చిత్రబృందం లిరికల్ సాంగ్స్ సక్సెస్ ను కేక్ కట్ చేసి సెలెబ్రేట్ చేసుకున్నారు. డైరెక్టర్ బాబీ, కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్, రచయిత కోన వెంకట్ ఈ సెలెబ్రేషన్స్ లో పాల్గొన్నారు. ఇందుకు సంబంధించిన పిక్స్ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. వాల్తేరు వీరయ్య రెండు లిరికల్ సాంగ్స్ కు శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీ చేసిన విషయం తెలిసిందే.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa