పాన్ ఇండియా సూపర్ స్టార్ ప్రభాస్ వినోదాత్మక చిత్రాల దర్శకుడు మారుతి డైరెక్షన్లో ఒక సినిమాను చేస్తున్నారన్న విషయం తెలిసిందే. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తున్న ఈ సినిమాలో మాళవికా మోహనన్,నిధి అగర్వాల్, రిద్ధి కుమార్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ పై ఎలాంటి అఫీషియల్ ఎనౌన్స్మెంట్ లేనప్పటికీ రకరకాల వార్తలు మాత్రం ఈ ప్రాజెక్ట్ ను హైలైట్ చేస్తున్నాయి.
లేటెస్ట్ ఇంట్రెస్టింగ్ బజ్ ప్రకారం, డైరెక్టర్ మారుతి ఈ సినిమా నుండి హీరోయిన్ నిధి అగర్వాల్ ను తప్పించారని తెలుస్తుంది. నిధి ప్లేస్ లో హీరోయిన్ మెహ్రీన్ కౌర్ ను తీసుకోవాలని అనుకుంటున్నారట... మరి, ఈ విషయంపై మరింత క్లారిటీ రావలసి ఉండగా... ఈ నెల 24 నుండి న్యూ షెడ్యూల్ స్టార్ట్ కాబోతుంది.
పోతే, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పాన్ ఇండియా మూవీ "హరి హర వీరమల్లు" సినిమాలో నిధి అగర్వాల్ మెయిన్ హీరోయిన్ గా నటిస్తున్న విషయం తెలిసిందే.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa