నటసింహం నందమూరి బాలకృష్ణ గారు నటిస్తున్న "వీరసింహారెడ్డి" నుండి ఇప్పటివరకు రెండు లిరికల్ సాంగ్స్ విడుదల కాగా, రెండూ కూడా శ్రోతలను విశేషంగా మెప్పిస్తున్నాయి. తాజాగా ఈ రోజు ఉదయమే మేకర్స్ థర్డ్ సింగిల్ రిలీజ్ అప్డేట్ ఇచ్చారు. ఈ మేరకు డిసెంబర్ 24 మధ్యాహ్నం 03:19నిమిషాలకు 'మా బావ మనోభావాలు' సాంగ్ విడుదల కాబోతుందని స్పెషల్ పోస్టర్ రిలీజ్ చేసారు.
లేటెస్ట్ గా మేకర్స్ ఈ సాంగ్ లాంచ్ ఈవెంట్ డీటెయిల్స్ ను పేర్కొంటూ అధికారిక ప్రకటన చేసారు. ఈ మేరకు డిసెంబర్ 24 మధ్యాహ్నం రెండు గంటల నుండి హైదరాబాద్ లోని సంధ్య 35MM థియేటర్లో మా బావ మనోభావాలు సాంగ్ లాంచ్ కాబోతుందని తెలుస్తుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa