సయేషా సైగల్.. అఖిల్ తొలి సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది.. ఈ మూవీ బ్రేక్ ఇవ్వకపోవడంతో ఆమె బాలీవుడ్, కోలీవుడ్ పై దృష్టి పెట్టింది. హిందీలో అజయ్ దేవగణ్ సరసన 'శివాయ్'లో నటించింది. తమిళంలో . 'వనమగన్', 'కడైకుట్టి సింగం', 'జుంగా', 'గజనీకాంత్' సినిమాలతో తమిళనాడులో మంచి గుర్తింపు తెచ్చుకుంది. తాజాగా ఈ 21 ఏళ్ల నటి తమిళ హీరో ఆర్యతో డేటింగ్ లో ఉన్నట్లు టాక్..ఈ ఇద్దరు కలసి గజనీకాంత్ మూవీలో నటించారు.. అప్పుడే ఈ ఇద్దరికీ పరిచయమై ప్రేమగా మారిందని అంటున్నారు.. త్వరలోనే ఈ ఇద్దరు వివాహం చేసుకోనున్నట్లు తమిళ మీడియా వార్తలు వస్తున్నాయి.. వారి పెళ్లికి సయేషా పేరేంట్స్ అంగీకరించినట్లు చెబుతున్నారు.. కాగా ఆర్య కంటే సయేషా 17 ఏళ్ల చిన్నది కావడం విశేషం.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa